అడ్మినిస్ట్రేషన్‌ ట్రైనింగ్‌కు ఎంపిపి ఎంపిక

Jun 17,2024 21:47

ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : జూన్‌ 20, 21 తేదీల్లో ఢిల్లీలో నీతి అయోగ్‌ ఆధ్వర్యంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో జరిగే ట్రైనింగ్‌ నీడ్‌ అసిస్టెంట్‌ శిక్షణా తరగతులకు ఇబ్రహీంపట్నం మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలు పాలడుగు జ్యోత్స్న దుర్గా ప్రసాద్‌ ఎంపికయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు సిఎంఒ సెక్రటరీ గిరిజా శంకర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపిపి పాలడుగు జ్యోత్స్నకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇబ్రహీంపట్నం మండల పరిషత్‌ అధ్యక్షురాలు పాలడుగు జ్యోత్స్నకు అరుదైన గౌరవం దక్కింది. ఈనెల 20,21 తేదీలలో ఢిల్లీలో నీతి అయోగ్‌ ఆధ్వర్యంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో రెండు రోజులపాటు జరిగే శిక్షణ తరగతులకు ఆమె ఆంధ్రప్రదేశ్‌ నుంచి హాజరుకానున్నారు. రెండు రోజులపాటు శిక్షణ తరగతులు హాజరైన ఆమె ఆ విషయాలను ఆంధ్రప్రదేశ్‌లో తెలియజేయనున్నారు.

➡️