ప్రజాసమస్యలు విస్మరించిన అధికారులు

May 18,2024 19:19
  • వాంబే కాలనీలో పర్యటించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు

విజయవాడ 60 డివిజన్‌ సింగ్‌ నగర్‌ పరిధిలో వాంబే కాలనీలో చిగురుపాటి బాబురావు సిపిఎం నేతలతో కలిసి ఇంటింటికి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బిజెపి, టిడిపి, వైసిపి ఇచ్చిన డబ్బును తిరస్కరించి నిజాయితీగా నిలబడిన కార్యకర్తలను బాబూరావు అభినందించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వివిధ దశల ఎన్నికల్లో బిజెపి మోడీ గ్రాఫ్‌ పడిపోతుందని 400 సీట్లు వస్తాయని మోడీ ప్రజలను మోసగిస్తున్నారని అన్నారు. వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చి లబ్ధి పొందాలని మోడీ బిజెపి తీవ్రంగా ప్రయత్నిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా మార్పులు వస్తున్నా మన రాష్ట్రంలో టిడిపి, వైసిపి ఇంకా బిజెపి మోడీకి అంటకాగటం సిగ్గు చేటన్నారు. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోను వైసిపి టిడిపిలు నోట్లతో రాజకీయాలు చేశాయన్నారు. సిపిఎం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎన్నికల అవసరం తర్వాత ప్రజలను గాలికి వదిలేయటం ఇతర పార్టీల నాయకుల తీరు అన్నారు. ఎన్నికల పేరుతో ప్రభుత్వ యంత్రాంగం ప్రజా సమస్యలను విస్మరించిందన్నారు. ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారు వారి బాధ్యత నిర్వహించడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజల అత్యవసర సమస్యలను ఇబ్బందులను అధికారులు పాలకులు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పోలింగ్‌ ముందు హడావుడి చేసిన యంత్రాంగం నేడు నత్త నడకన సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు కె.దుర్గారావు, ఎస్కే పీర్‌ సాహెబ్‌, కళ్యాణ్‌, ఓంకార్‌ రంగస్వామి సూరప్ప కూడా రవి అప్పన్న డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️