ప్రజాశక్తి నగర్ లో నీటి కొరకు తీర్చండి

Apr 10,2024 11:26 #ntr district

ఖాళీ బిందెలతో స్థానిక ప్రజలు నిరసన మద్దతు తెలిపిన సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు

ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : మార్చ్ ఏప్రిల్ నెలలోనే మంచినీటి కొరకు ఏర్పడిందని దాని కోసం ప్రజాశక్తి నగర్ స్థానికులు ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి మద్దతుగా సిపిఎం సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి చెరుకూరి బాబురావు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ బాబురావు మాట్లాడుతూ నగరంలో మంచినీటి సమస్య అధికంగా ఉందని దానికి కోసం ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు పట్టించుకోవడంలేదని ప్రజా సమస్యలు తీర్చకుండా నాయకులు ఓట్లు కోసం ఆరాటం పడుతున్నారని ప్రజల సమస్యలు పట్టించుకునే నాధుడు లేడని కృష్ణా నది పక్కనే ఉంచుకొని నీటి కొరత రావటం దారుణం అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, మేయర్, డిప్యూటీ మేయర్ ప్రజా సమస్యలు పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా మంచినీటి కొరత ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని అన్నారు. అధికారులు అందరూ మంచినీరు కొరత లేకుండా చూడాలని అదేవిధంగా నెలరోజుల నుండి మంచినీళ్లు బదులు మురుగనీరు బోరు నీళ్లు వస్తున్నాయని అవి త్రాగటం వలన అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. దుర్వాసన రాకుండా మంచినీళ్లు సప్లై చేయాలని వాటర్ ట్యాంకర్ నుండి వచ్చే వాటర్ సరిపోవటం లేదని రోజుకు అర్ధ గంట మాత్రమే నీళ్లు వస్తున్నాయని వాసన వచ్చే నీళ్లు తాగటం వలన ప్రజలకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మండిపడ్డారు. దానికి సంబంధించి సిపిఎం పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టి నూతన బోరు వేయించటం వరకు పోరాడింది కమ్యూనిస్టులు మాత్రమే అన్నారు. రాష్ట్ర రాజకీయ నాయకులు ప్రజల అవసరాలు పట్టవు గాని ఓట్ల కోసం వచ్చి ఇంటింటికి తిరుగుతున్నారని ప్రజల వారికి బుద్ధి చెబుతారని ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎంకు మద్దతు తెలపాలని కోరారు. బిజెపి, టిడిపి జనసేన, వైసీపీలను ఓడించాలని కమ్యూనిస్టులకు సెంట్రల్ నియోజకవర్గంలో పని చేసే వారిని గెలిపించుకోవాలని ప్రజా సమస్యలపై పిలిస్తే పలికే సిపిఎం నాయకులకు అండగా ఉండాలని అన్నారు. దీనిపై ఉన్న అధికారులు స్పందించి మంచినీటి కొరత లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సిటీ కార్యదర్శి బి రమణరావు, అధ్యక్షులు కే దుర్గారావు, ఎస్ కే పి నాగేశ్వరావు, రాంబాబు, సాంబిరెడ్డి, అమ్ములు, ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.

➡️