ఘనంగా రంజాన్ పండుగ

Apr 11,2024 11:33 #ntr district

ప్రజాశక్తి-గంపలగూడెం: మండల కేంద్రమైన గంపలగూడెం లో నేడు (ఈద్-ఉల్-ఫితర్)రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. బుధవారం నెలవంక కనిపించడంతో ముస్లింల ఉపవాసానికి తెరపడింది. పేదా, సాదా అనే తేడా లేకుండా ముస్లిమ్ లు పండుగ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా మసీదు నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, గురువు (అల్లా) చెప్పిన ఆచార హితవును అవలంబించాలని ప్రతి మనసులోనూ పునాది వేసుకున్నారు. ఈ రంజాన్ పర్వదినాన్ని మండలంలోని జింకలపాలెం, పెనుగొలను, గోసవీడు, ఊటుకూరు, తదితరు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు.

➡️