ఘనంగా రంజాన్‌ వేడుకలు

Apr 11,2024 21:59

రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని పలుచోట్ల మసీదులు ముస్తాబయ్యాయి. ముస్లిం సోదరులు ప్రేమతో ఆలింగనం చేసుకుని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పలువురు ప్రముఖులు, పలు పార్టీల నాయకులు రంజాన్‌ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : రంజాన్‌ పండుగ పురస్కరించుకొని గురువారం ముస్లిం, సోదరీ సోదరీమణులకు, డివిజన్‌ ప్రజలకు సిపిఎం ఫ్లోర్‌ లీడర్‌, 50 డివిజన్‌ కార్పొరేటర్‌ బోయి సత్యబాబు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. స్నేహం, సామరస్యాలను పెంపొందించే వివిధ మతాల పండగలను ఐకమత్యంగా జరుపుకోవడం మతసామరస్యానికి దోహదపడుతుందని కొనియాడారు. శాంతి సామరస్యాన్ని స్నేహభావాన్ని అన్ని పండుగ దినాల్లో చాటి చెప్పడమే మానవ పరమార్ధమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ సభ్యులు పి. రాజు,ఏ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. వైసిపి పశ్చిమ అభ్యర్థి షేక్‌ అసిఫ్‌ పలు మసీదుల్లో పాల్గొన్నారు. విజయవాడ గాంధీజీ మహిళా కళాశాలలో రంజాన్‌ సందర్భంగా ఈద్‌-ఉల్‌-ఫితర్‌ నమాజ్‌కు వైసిపి పశ్చిమ ఎంఎల్‌ఎ అభ్యర్థి షేక్‌ ఆసిఫ్‌ పాల్గొని రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. 39వ డివిజన్లో గల మదీనా మస్జిద్‌ ఈద్గా కమిటీ వారి ఆహ్వానం మేరకు ఈద్‌-ఉల్‌-ఫితర్‌ నమాజ్‌ తదనంతరం ముస్లిం మత పెద్దలను ప్రజలను మైనారిటీ నాయకులను కలిశారు. స్థానిక కార్పొరేటర్‌ గుడివాడ రాఘవ నరేంద్ర, మదీనా మజీద్‌ కమిటీ వారు ప్రెసిడెంట్‌ షేక్‌ మౌలాలి, సెక్రెటరీ ఎస్‌ డి హుస్సేన్‌. వైస్‌ ప్రెసిడెంట్‌ గాలి షాహిద్‌ కమిటీ సభ్యులు షేక్‌ సుభాని, షేక్‌ వసీం, షేక్‌ బాషా, షేక్‌ బషీర్‌ తదితర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గం చిట్టినగర్‌ సెంటర్‌ లోని మోతీ మసీద్‌ ఈద్గాలో కేశినేని శివనాథ్‌, టిడిపి, జనసేన బలపరిచిన పశ్చిమనియోజక వర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్ధి సుజనా చౌదరితో కలిసి నమాజ్‌తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలలో టిడిపి అధికార ప్రతినిధి కె.నాగుల్‌ మీరా, టిడిపి నాయకులు ఎమ్‌.ఎస్‌.బేగ్‌, రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, రాష్ట్ర వాణిజ్య విభాగ అధ్యక్షుడు డూండీ రాకేష్‌ పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం శివనాథ్‌ నాయకులతో పాటు ముస్లిం సోదరలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మసీద్‌ ఇమామ్‌ నజీర్‌ అహ్మాద్‌ ని కలిసి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. గంపలగూడెం: మండల కేంద్రమైన గంపలగూడెంలో నేడు (ఈద్‌-ఉల్‌-ఫితర్‌) రంజాన్‌ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మండలంలోని జింకల పాలెం, పెనుగొలను, గోసవీడు, ఊటుకూరు, తదితర గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండలంలో రంజాన్‌ పర్వదిన వేడుకలను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రెడ్డిగూడెం, మద్దులపర్వ, ముచ్చనపల్లి, రంగాపురం గ్రామాల్లో రంజాన్‌ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. నందిగామ : నందిగామలో రంజాన్‌ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. నందిగామ ఎంఎల్‌ఎ మొండితోక జగన్‌ మోహన్‌రావు, ఎంఎల్‌సి మొండితోక అరుణ్‌ కుమార్‌ పెద్ద మసీదు వద్ద ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. జగ్గయ్యపేట: రంజాన్‌ పండుగను పురస్కరించుకొని మండలంలోని షేర్‌ మహమ్మద్‌ పేట, చిల్లకల్లు, గండ్రాయి, గౌరవరం, పోచంపల్లి ముక్త్యాల, అనుమంచిపల్లి గ్రామాలతోపాటు జగ్గయ్యపేట పట్టణంలో మసీదులలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బలుసుపాడు రోడ్డు ఈద్గాలో నెట్టెం శ్రీ రఘురామ్‌ పాల్గొన్నారు. తిరువూరు : ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఇస్లాం మత గురువు రిజ్వీ ఈద్‌ ఉల్‌ ఫితర్‌ విశిష్టతను తెలిపారు. వైసిపి, టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థులు నల్లగట్ల స్వామిదాసు, కొలికపూడి శ్రీనివాసరావులు ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు. మైలవరం : రంజాన్‌ వేడుకలను గురువారం మైలవరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైసిపి మైలవరం నియోజకవర్గ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు, నియోజకవర్గ పరిశీలకులు అప్పిడి కిరణ్‌ కుమార్‌ రెడ్డిలు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. పెనమలూరు : ఎమ్‌డి సిద్దీక్‌, పెనమలూరు వైసిపి ముస్లిం మైనారిటీ నాయకులు, మత పెద్దలు ‘మస్జీద్‌ ఏ ముబారక్‌’ ఆధ్వర్యంలో ఈద్‌ ఉల్‌ ఫితర్‌ నమాజ్‌ జరుపుకున్నారు. విజయవాడ అర్బన్‌ : మానవులందరూ సుఖ సంతోషాలతో ఉండటమే రంజాన్‌ పండుగ విశిష్టత అని ముప్తి రియాజ్‌ అన్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో రంజాన్‌ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమనం గురువారం ఉదయం జరిగింది. ఈ సందర్భంగా రంజాన్‌ సోదరులను ఉద్దేశించి ఆయన తెలుగులో ప్రసంగించారు. విస్సన్నపేట : తాతకుంట్ల గ్రామ శివారు గోరంపాలెం ముస్లిం పేటలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష అనంతరం రంజాన్‌ పండుగ సందర్భంగా జమియా మసీదులో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి గ్రామ అధ్యక్షులు షేక్‌ కాలేశా, గ్రామ ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం: కొండపల్లి మున్సిపాలిటీ వెస్ట్‌ ఇబ్రహీంపట్నంలో రంజాన్‌ సందర్భంగా మసీదు మత గురువులు వారిని కలిసి రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న మైలవరం నియోజకవర్గం వైసిపి అభ్యర్థి తిరుపతిరావు, కౌన్సిలర్‌ జోగి రాము, కౌన్సిలర్‌ మొగిలి దయ, కోమటి కోటేశ్వరరావు, శ్రీనివాస్‌ రెడ్డి, నల్లమోతు బోసు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. రంజాన్‌ పండుగను పురస్కరించుకుని హజ్రత్‌ సయ్యద్‌ షాబుఖారి బాబా ఆస్థానంలో అల్తాఫ్‌ బాబా తో కలిసి మైలవరం నియోజకవర్గ శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

➡️