ప్రతిభావంతులకు సత్కారం

Apr 14,2024 22:42

జగ్గయ్యపేట: జగ్గయ్యపేట జూనియర్‌ కాలేజ్‌ (జేఆర్‌సి) ఈ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి, పట్టణ స్థాయిలో అన్ని గ్రూప్‌లలో మొదటిర్యాంక్‌ను సాధించి ప్రతిభ కనపరిచారని కళాశాల చైర్మన్‌ రంగాపురం నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులను పసిడి పతకాలతో సత్కరించారు. బైపీసీలో టౌన్‌ ఫస్ట్‌ సాధించిన ఆకాంక్ష 988/1000, ఎంపీసీలో టౌన్‌ ఫస్ట్‌ సాధించిన షేక్‌ ఆఫ్రిన్‌ 987/1000 ఎంఇసిలో టౌన్‌ ఫస్ట్‌ సాధించిన బి.శ్రావణ భార్గవ్‌ 966/1000 సిఇసిలో టౌన్‌ ఫస్ట్‌ సాధించిన షేక్‌ రేష్మ, ఫేక్‌ సల్మాలకు బంగారు పతకాలను, మెమోంటో లను అందజేశారు. ఈ కార్యక్రమంలో యాజమాన్య ప్రతినిధులు సెక్రటరీ, కరస్పాండెంట్‌ పెనుగొండ వెంకట రాజీవ్‌, ప్రెసిడెంట్‌ కొత్తమాసు మల్లికార్జునరావు, సభ్యులు అప్పన ఉదయభాస్కర్‌ పాల్గొన్నారు. 2024 జూనియర్‌, సీనియర్‌ ఇంటర్‌ ఫలితాలలో ఎంపిసి టౌన్‌ఫస్ట్‌ సిహెచ్‌.కవిత 464/470 బైపిసి టౌన్‌ ఫస్ట్‌ ఎస్‌ శ్రావణి 429/470బీ ఎంఇసి టౌన్‌ఫస్ట్‌ వై.జెస్సికా 426/470 సిఇసి కాలేజ్‌ టాపర్‌ వై.మేఘనా, విజయరాజ్‌ 466/500బీ ప్రతిభ కనపరిచారు .సీనియర్‌ ఇంటర్లో బైపీసీ టౌన్‌ ఫస్ట్‌ టీ.వీ.ఎస్‌ కృష్ణ సౌమ్య 986/1000బీ ఎంపీసీ టౌన్‌ సెకండ్‌ జి.సంస్కృతి 984/1000, పి.కీర్తి 984/1000 పి.కృష్ణ చేతన్‌ 984/1000 సీనియర్‌ ఎంఇసి టౌన్‌ ఫస్ట్‌ పి.నరేంద్ర 926/1000 సీనియర్‌ సిఇసి కాలేజ్‌ టాపర్‌ ఎస్‌.రామాంజనేయులు 905/1000బీ వీరందరినీ వారి తల్లిదండ్రులతో సహా సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో విశ్వ భారతి డిగ్రీ కళాశాల సెమిస్టర్‌ లలో టౌన్‌ ఫస్ట్‌ సాధించిన విద్యార్థులను, లైఫ్‌ స్కిల్స్‌ ఒకేషనల్‌ జూనియర్‌ కాలేజ్‌ స్టేట్‌ ర్యాంకర్స్‌ను, టౌన్‌ఫస్ట్‌ సాధించిన విద్యార్థులను, అమ్మాని కళాశాలలో కాలేజీ టాపర్స్‌కు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపల్స్‌, ప్రతినిధులు జె అబ్బులు, కేఎన్‌ రమేష్‌, జే తిరుపతిరావు, సుధీర్‌, వెంకటేశ్వరరాజు పాల్గొన్నారు.

➡️