రైతులకు క్షేమ కానుక ‘సుకృతి’ ప్రారంభం

Jun 18,2024 22:30

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : క్షేమ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌, దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రధాన పంట బీమా పథకం సుకృతిని అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం రూ.499కే క్షేమ పంట బీమా పథకం అందుబాటులో ఉందని చీఫ్‌ అండర్‌ రైటింగ్‌ ఆఫీసర్‌ సీవీ.కుమార్‌ అన్నారు. మంగళవారం నగరంలోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకరాకు బీమా చేయించుకోవడానికి రూ.499 మాత్రమే ఖర్చవుతుందని తెలిపారు. రైతులకు తగినంత శక్తిని తిరిగి అందించేలా 100 పైగా ఎక్కువ పంటలను రక్షించే పంట బీమా పథకాలున్నాయని తెలిపారు. రుతుపవనాల రాకతో అన్ని ముఖ్యమైన ఖరీఫ్‌ పంటలు విత్తే కాలం మొదలవుతున్నందున ఈ బీమా ఉత్పత్తిని అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. సుకృతిని కొనుగోలు చేయడానికి క్షేమ యాప్లోకి లాగిన్‌ కావాలని, ప్రకృతి వైపరీత్యాలు, జంతువుల దాడి, విమానాల వల్ల పంటనష్టం కలిగితే పరిహారం పొందొచ్చని చెప్పారు. రైతులకు తమ పంటలను ముందుగా నిర్ణయించిన తొమ్మిది ప్రమాదాల జాబితా నుంచి ఒక పెద్ద, ఒక చిన్న ప్రమాదాల కలయికతో బీమాను ఎంచుకోవచ్చన్నారు. తమ పంటను ఎక్కువగా ప్రభావితం చేసే పలు విపత్తుల నుంచి రైతులకు ఇది భరోసా అందిస్తుందన్నారు. తుఫాను, ఉప్పెన, వరదలు, కొండచరియలు విరిగిపడటం, పంట నష్టాలు సైతం కవర్‌ చేసేలా బీమా అందుబాటులో ఉందన్నారు.

➡️