ఉత్సాహభరితంగా ముగిసిన చెస్‌ పోటీలు

Apr 21,2024 21:45
  •  – విజేతలుగా డి.సాత్విక్‌, షణ్ముఖరెడ్డి

 ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : కృష్ణాజిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోరంకిలోని గ్రీన్‌ స్కూల్‌లో రెండు రోజుల నుండి జరుగుతున్న రాష్ట్రస్థాయి అండర్‌ -17 చెస్‌ పోటీలు ఆదివారం సాయంత్రంతో ఉత్సాహంగా ముగిశాయి. ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి 62 మంది క్రీడాకారులు పాల్గొన్నారని కృష్ణాజిల్లా చెస్‌ అసోసియేషన్‌ సెక్రటరీ ఎం.ఎం.ఫణికుమార్‌ తెలిపారు. బాలుర విభాగంలో డి.సాత్విక్‌, భాస్కర రత్న షణ్ముఖ రెడ్డి మొదటి రెండు స్థానాలు సాధించగా బాలికల విభాగంలో జి.అమూల్య, వై.పెర్మీ రక్షిత మొదటి రెండు స్థానాలు సాధించారని తెలిపారు. వీరు త్వరలో జరుగనున్న నేషనల్‌ అండర్‌ -17 చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టోర్నమెంట్‌కు అర్హత సాధించారన్నారు. వివిధ ఏజ్‌ గ్రూపులలో కూడా పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేసినట్లు తెలిపారు. అండర్‌ -7 బాలుర విభాగంలో కె.సుధీర్‌, నందన్‌ రెడ్డి, బాలికల విభాగంలో కుశల్‌ కార్తికేయ, శ్రీ వశిష్ట మొదటి రెండు స్థానాలు సాధించారన్నారు. అండర్‌ -11 బాలుర విభాగంలో వర్థన్‌, సుహాస్‌, అండర్‌ -13 బాలుర విభాగంలో షణ్ముఖ సాయి, యతిన్‌ రెడ్డి మొదటి రెండు స్థానాలు సాధించారన్నారను. అండర్‌ -15 బాలుర విభాగంలో షణ్ముఖ రెడ్డి, దుర్వేశ్‌, మొదటి రెండు స్థానాలు సాధించారని తెలిపారు. అండర్‌ -7 బాలికల విభాగంలో యశ్విత వర్మ, కావ్య , అండర్‌ -9 బాలికల విభాగంలో గురు వర్థిని, సహస్ర వర్మ, అండర్‌ -11 బాలికల విభాగంలో పేర్మి రక్షిత, స్నేహశ్రీ, అండర్‌ -13 బాలికల విభాగంలో అముల్య, త్రిపురాంబిక, అండర్‌ -15 బాలికల విభాగంలో సాయి దివ్య, కార్తిక మొదటి రెండు స్థానాలు సాధించారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఆంధ్ర చెస్‌ అసోసియేన్‌ జాయింట్‌ సెక్రటరీ రామ సుబ్బారెడ్డి, గ్రీన్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సాయి అపర్ణ, ఎస్‌.ఆర్‌.ఆర్‌. ఛారిటబుల్‌ ట్రస్టు అధినేత పి.రేణుక, అధ్యక్షులు జె.సౌజన్య, గుడివాడ చెస్‌ మేనేజర్‌ సుమన్‌, విజయవాడ చెస్‌ కోచ్‌ సతీష్‌ వర్మ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.

➡️