కొనకళ్ళకు పలువురి పరామర్శ

May 17,2024 21:23

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు, బందరు మాజీ పార్లమెంట్‌ సభ్యులు కొనకళ్ళ నారాయణరావుకు గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు విజయవాడలోని రమేష్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ధ్రువీకరించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆసుపత్రిలో కొనకళ్ళని ఉత్తరాంధ్ర పార్లమెంటరీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మాజీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుల్‌ మీరా, తూర్పు శాసన సభ్యులు గద్దె రామ్మోహన్‌లు పరామర్శించి, ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.

➡️