పదిలో సత్తా చాటిన విద్యార్థులు

Apr 23,2024 22:08
  • గుంటుపల్లి డాన్‌ బాస్కో విద్యా కుసుమాలు

పదవ తరగతి ఫలితాల్లో గుంటుపల్లి డాన్‌ బాస్కో (స్టేట్‌) విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని పాఠశాల ప్రిన్సిపాల్‌ ఫాదర్‌ ఇన్నా రెడ్డి పేర్కొన్నారు. పదిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాద్యాయులు అభినందించారు. భవ్యమంజు శ్రీ 584 మార్కులతో పది ఫలితాల్లో మండల స్థాయి ర్యాంకర్‌ నిలిచారు. 500 పైగా మార్కులు సాధించిన 38 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. 96 శాతం ఉతీర్ణత సాధించిన పాఠశాలగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ ఇన్నారెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు 105 మంది విద్యార్థులు 100 మంది ఉతీర్ణత సాధించారని తెలిపారు. 584 మార్కులతో భవ్య మంజు శ్రీ పాఠశాలలో అధిక మార్కులు సాధించి మండల స్థాయి ర్యాంకర్‌గా నిలిచిందన్నారు. 38 మంది 500 మార్కులు పైగా సాధించారని పేర్కొన్నారు. 96 శాతం ఉతీర్ణత సాధించడం గర్వకారణంగా ఉందని తెలిపారు.మండల స్థాయిలో నిలిచిన కొండపల్లి జెడ్‌పి విద్యార్థినులు ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇబ్రహీంపట్నం మండల స్థాయిలో ప్రథమ స్థానం 577/600 సాధించిన కొండపల్లిలోని జెడ్‌ పిబాలికోన్నత పాఠశాల విద్యార్థినులు బండారు ఉషారాణి 577 మార్కులతో, ఎస్‌కె.షఫీనా 577 మార్కులతో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన వీరు ఇబ్రహీంపట్నం మండలం ప్రథమ స్థానాలు సాధించి పాఠశాల కు మంచి పేరు సంపాదించి పెట్టారని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ సందర్భంగా నందిగామ ఉప విద్యాశాఖాధికారి ఏ.వెంకటప్పయ్య పిల్లలకు ఆశీస్సులు అందించారు. మరో విద్యార్థినీ జి.అలేఖ్య 558 మార్కులతో ద్వితీయ స్థానంలో, వై.మౌనిక 540 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారని హెచ్‌ఎమ్‌ బి.పద్మలత తెలిపారు. ఇబ్రహీంపట్నం మండల స్థాయిలో మొదటి స్థానాన్ని, మండల స్థాయిలో ఎక్కువ మార్కులు సాధించిన ఘనత మండల స్థాయిలో 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 23 మంది ఉన్నారని, హిందీ, ఇంగ్లీష్‌ సబ్జెక్టులకు సంబంధించి నూరు శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అన్ని సబ్జెక్టులలోనూ 90శాతం పైగా ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఎస్‌ఎమ్‌సి చైర్‌పర్సన్‌ ఎన్‌.పుష్ప విద్యార్థులను ఉపాధ్యాయులను అభినందించారు.టెన్త్‌ మండల్‌ టాపర్‌ నవీన్‌ రెడ్డిప్రజాశక్తి – గంపలగూడెం: 2023- 24 విద్యా సంవత్సరానికి సంబంధించి గంపలగూడెం మండలం పదో తరగతి పరీక్షలు ఫలితాలను విద్యా శాఖ నుండి వచ్చిన వివరాల ప్రకారం పరిశీలిస్తే,11 ప్రభుత్వ,9 ప్రైవేటు పాఠశాలుండగా, ప్రైవేటు పాఠశాలైన స్థానిక లిటిల్‌ ఏంజిల్స్‌ స్కూల్‌ విద్యార్థి వెన్నపూస నవీన్‌ రెడ్డి 584/600 మార్కులు సాధించి మండల టాపర్‌గా, నిలిచాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాల గంపలగూడెం పాఠశాల నుండి పి.నిఖిత 580/600మార్కులతో మండల టాపర్‌ అనే పదాన్ని దక్కించుకుంది. పాఠశాలల వారీగా, వివరాలు క్రింది విధంగా ఆయా ప్రధానోపాధ్యాయులు తెలిపారు. నెమలి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుండి 30 మంది పరీక్షలకు హాజరు కాగా 28 మంది ఉత్తీర్ణులుకాగా, 93.33శాతంగా చెప్పారు. ఊటుకూరు పాఠశాల నుండి 72కి 58 ఉత్తీర్ణులు కాగా, 80.56శాతం, ఆర్లపాడు నుండి 31కి 28 ఉత్తీర్ణులు, 90శాతం, సత్యాల పాడు 29కి 28 ఉత్తీర్ణులు, 93శాతం, పెనుగొలను 66కి 62 ఉత్తీర్ణులు, 93.94శాతం, గంపలగూడెం 100కి 76 ఉత్తీర్ణులు, 76శాతం, కనమూరు 57కి 56, 98.25శాతం, తునికిపాడు 16కి14 87.5శాతం, కేజీబీవీ గర్ల్స్‌ పెదకొమెర 40కి 40, 100శాతం, మోడల్‌ స్కూల్‌ పెద్ద కొమెర 84కి 84 100శాతం, ఏబీఎన్‌ హెచ్‌ఎస్‌.అమ్మిరెడ్డిగూడెం 8కి 4 50శాతం, మొత్తంగా, 205కి 198 ఉత్తీర్ణులు, 96.59 శాతం.ప్రైవేటు పాఠశాలల వివరాలుసిద్ధార్థ హై స్కూల్‌, ఊటుకూరు 43కి 43 ఉత్తీర్ణులు, 100శాతం, కేరళ ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌ ఊటుకూరు 11కి 11,100శాతం, వివేకానంద విద్యాలయం హై స్కూల్‌ గొల్లపూడి 34కి 33, 97.06 శాతం, శ్యాం జ్యూస్‌ ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌ తోటమూల 14కి 14, 100శాతం, శ్రీ సరస్వతి ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ తోటమూల 6కి 6, 100 శాతం, లిటిల్‌ ఏంజిల్స్‌ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ గంపలగూడెం 36కి 34,94.44శాతం విజ్ఞాన్‌ హై స్కూల్‌ గంపలగూడెం 4కి 4, 100శాతం, శ్రీ గాయత్రి ఇంగ్లీష్‌ మీడియం హై స్కూల్‌, పెద్ద కొమెర 52కి 52 100శాతం, గీతాంజలి ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ తోటమూల 39కి 39 – 100 శాతం, మొత్తంగా, 239 కి 236 ఉత్తీర్ణులు 98.74 శాతం కాగా, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వెరసి 444కి 434మంది ఉత్తీర్ణులు కాగా, 97.75శాతంగా వివరించారు.91.30 శాతం ఉత్తీర్ణతప్రజాశక్తి – తిరువూరు : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఏ.కొండూరు మండ లం, పోలిశెట్టిపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు 91.30 శాతం ఉత్తీర్ణత సాధించి మండల స్థాయిలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారని ప్రధానోపాధ్యాయులు ఎ.రవికుమార్‌ వెల్లడించారు. పాఠశాల స్థాయిలో అత్యధికంగా కాకర్ల సాహితీ 525, పట్టెం జాహ్నవి 506, కొమ్ము ఉమాంజలి 506 మార్కులు సాదించారన్నారు. ఈవిద్యార్థులను ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులు మంగళవారం దుశ్శా లువాతో సత్కరించి అభినందించారు. ఈసందర్భంగా ప్రధానో పాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ తో తగిన నైతిక విలువలతో చక్కటి ప్రణాళికతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలకు చేరు కుంటారన్నారు. శ్రీరామ్‌ విద్యార్థుల ప్రతిభ ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో సింగ్‌నగర్‌ శ్రీరామ్‌ హైస్కూల్‌ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని స్కూల్‌ ప్రిన్సిపాల్‌ బోని సురేష్‌ కుమార్‌, డైరెక్టర్‌ బోని మాధురి తెలిపారు. పాఠశాల ఆవరణలో ప్రతిభావంతులైన విద్యార్థులకు అభినందన సభ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 594 మార్కులకు పఠాన్‌ అజ్మీర్‌ ఖాన్‌, 593 మార్కులతో డి.లేఖ శ్రీ అత్యుత్తమ మార్కులు సాధించారని తెలిపారు. 580కిపైగా మార్కులు 10 మంది విద్యార్థులు సాధించగా, 500 పైగా మార్కులు 60 మంది విద్యార్థులు సాధించారన్నారు. శ్రీ రామ్‌ స్కూల్‌ నుండి 126 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 99.06 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, ఉపాధ్యాయుల శ్రద్ద ఉత్తమ ఫలితాలకు కారణం అన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. శ్రీ విద్యా సంస్థల ప్రతిభప్రజాశక్తి – నందిగామ : 2023-2024 పదో తరగతి ఫలితాల్లో శ్రీ విద్య హైస్కూల్‌ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని పాఠశాల చైర్మన్‌ కందుల మల్లికార్జునరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు ఎస్‌.మురళీధర్‌ రెడ్డి 587/600, శ్రీ లాస్య 586/600 మార్కులు సాధించి నందిగామ టాపర్స్‌గా నిలిచారని తెలిపారు. 580 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 10 మంది, 550 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 44 మంది, 500 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 93 మంది ఉన్నారని తెలిపారు. ఈ ఘనతను సాధించిన విద్యార్థులను శ్రీ విద్య హై స్కూల్‌ చైర్మన్‌ కందుల మల్లిఖార్జునరావు, డైరెక్టర్‌ రాము, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. నందిగామ మండలం మాగల్లు గ్రామానికి చెందిన కస్తాల నూతన ప్రసాద్‌ (అడ్వకేట్‌) కుమారుడు కస్తాల జయదీప్‌ 578 మార్కులు సాధించాడు. మాగల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ కస్తాల జయదీప్‌ అతి సామాన్య కుటుంబంలో పుట్టి ఎంత ఉన్నత విలువలు కలిగి క్రమశిక్షణతో చదువుకొని గవర్నమెంట్‌ స్కూల్లో కూడా ఇలాంటి ఫలితాలు రాబట్టవచ్చని నిరూపించాడన్నారు.

➡️