Jun 17,2024 20:41
అంకిత భావంతో చదవాలి

విద్యార్థిని అభినందిస్తున్న దృశ్యం
అంకిత భావంతో చదవాలి
ప్రజాశక్తి-గుడ్లూరు:పదో తరగతిలో ఎక్కువ మార్కులు సాధించడం కోసం కష్టపడిన విద్యార్థులు ఉన్నత చదువులు కోసం అంకితభావంతో చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుడ్లూరు, బసిరెడ్డి పాలెం, రావూరు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టీవీ రామ్మోహన్‌ రావు వెంకటేశ్వరరావు అన్నారు గుడ్లూరు అభ్యుదయ పాఠశాలలో యశ్వంత్‌ సాయి తేజ మెమోరియల్‌ ట్రస్టు నిర్వాహకులు ఏర్పాటుచేసిన పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు అభినందన సభలో ఆదివారం ప్రసంగించారు పదో తరగతి నుంచి కాలేజీలో చేరిన విద్యార్థులు పెడతోవ పట్టకుండా అంకితభావంతో ఉన్నత చదువులు చదవాలన్నారు. ప్రతిభ కనబరిచిన 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు యశ్వంత్‌ సాయి తేజ మెమోరియల్‌ ట్రస్టు నిర్వాహకులు అజరు కుమార్‌ విద్యార్థిని, విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. గుడ్లూరు మండలంలో పదో తరగతిలో 580 మార్కులు సాధించిన గిరీష్‌ కుమార్‌కి రూ6వేలు, 576 మార్కులు సాధించిన భవ్యశ్రీకి రూ.4వేలు, 574 మార్కులు సాదించిన వేద వైష్ణవికి రూ.3వేలు నగదు అందజేశారు. శ్రీ చైతన్య అభ్యుదయ స్కూలు ప్రిన్సిపల్స్‌ దామా సోమా నాయుడు, కలగారెడ్డి, పదో తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️