31న ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రీజినల్ జాబ్ మేళా

  • ప్రారంభించనున్న మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 31 న విజయనగరంలో ఉన్న సీతమ్ ఇంజనీరింగ్ కళాశాలలో రీజినల్ జాబ్‌ మేళా నిర్వహించ్చన్నున్నట్లు ప్రొఫెసర్ వైస్ ఛాన్సెలర్ పి. వి.జి .డి . ప్రసాద్ రెడ్డి, సీతమ్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్.మజ్జి శశిభూషణరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ జాబ్ మేళా కరపత్రాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ చేతులు మీదుగా ఆవిష్కరించారు. జాబ్ మేళా ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించనున్నట్లు తెలిపారు.ఈ రీజినల్ జాబ్ మేళా లో ఐటీ సెక్టార్, ఫార్మా, మెన్ఫాక్చరింగ్, ఆటోమొబైల్, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్,టూరిజం &హాస్పిటాలిటీ, రిటైల్, మార్కెటింగ్, లాజిస్టిక్స్, రిటైల్ జ్యువలరీ ల నుండి సుమారుగా 5892 ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని ఉత్తరాంధ్ర లో ఉన్న ఆరు జిల్లాలో ఉన్న యువత సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసారు.ఈ రీజినల్ జాబ్ మేళా కు పదవతరగతి నుండి పీజీ వరుకు చదువుకొని ఉన్న నిరుద్యోగ యువతీయువకులు హాజరు కావాలని, స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉందని తెలియజేసారు. ఎంపికైన అభ్యర్థులు కు విశాఖపట్నం,ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉద్యోగం ఉoటుందని, అభ్యర్థుల స్కిల్ బట్టి 15000 నుండి 60000 వేల వరుకు వేతనాలు ఉంటాయని, బుధవారం ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ స్కిల్ డెవలప్మెంట్ అధికారి రోహిణి,విజయనగరం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి గోవిందరావు, విశాఖపట్నం జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సాయి కృష్ణ చైతన్య, ప్లేసెమెంట్ అధికారులు రమేష్, భాస్కర్ లు పాల్గొన్నారు.

➡️