వైసిపితోనే అందరికీ సమన్యాయం

ప్రజాశక్తి-దర్శి : వైసిపితోనే బలహీన, బడుగు మైనార్టీ వర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని వైసిపి దర్శి నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని పొతకమూరు పంచాయతీలో పరిధిలోని పొతకమూరుచెరువు, కొమ్ముపాలెం, పాపిరెడ్డిపాలెంలో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్సర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలంటే మళ్లీ జగన్‌మెహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను, వైసిపి ఒంగోలు పార్లమెంట్‌ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు వైసిపిలో చేరారు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సర్పంచులు బొట్ల వెంకయ్య, ముచ్చుమూరి వెంకట్‌రెడ్డి, ఎంపిటిసి, వైస్‌ ఎంపిపి సోము దుర్గారెడ్డి, మాజీ సర్పంచి వెన్నపూస నాగిరెడ్డి వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు వెన్నపూస వెంకటరెడ్డి, కార్పొరేషన్‌ డైరెక్టర్లు కుమ్మితంగిరెడ్డి, డాక్టర్‌ ఎస్‌ఎం.బాషా, మాజీ సర్పంచి జైనుల్‌, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దొనకొండ : పేదల సంక్షేమమే థ్యేయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ తెలిపారు. దొనకొండలోని బ్రహ్మరావుపేట, ఆర్యవైశ్య బజారు, పెద్దమసీదు బజారులో వైసిపి దర్శి నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి మద్దతుగా బూచేపల్లి వెంకాయమ్మ, శివప్రసాద్‌రెడ్డి సతీమణి నందిని శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కుమారుడు శివప్రసాద్‌రెడ్డికి, వైసిపి ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి ఉషా మురళి, వైసిపి మండల అధ్యక్షుడు కాకల కష్ణారెడ్డి, మాజీ జడ్‌పిటిసి శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, దొనకొండ ఉపసర్పంచి ఇమ్రాన్‌ఖాన్‌, ఎంపిటిసి అమ్మాజీ తదితరులు పాల్గన్నారు.

➡️