తాడిపర్రులో మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

Apr 21,2024 12:53 #buttermilk, #Chalivendram, #Opening

ప్రజాశక్తి – ఉండ్రాజవరం (తూర్పు గోదావరి) : మండలంలోని తాడిపర్రులో ఆదివారం మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవిలో స్థానికులతోపాటు, గ్రామం మీదుగా ఇతర ప్రాంతాల నుండి రాకపోకలు సాగించే ప్రయాణీకులకు దాహార్తిని తీర్చేందుకు దాత గారపాటి సత్యనారాయణ, తదితరుల ఆధ్వర్యంలో చలివేంద్రంను ప్రారంభించారు. తొలి రోజు ప్రారంభంలో సర్పంచ్‌ కరుటూరి నరేంద్రబాబు మజ్జిగ, తాగునీటిని అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కె.విజయచౌదరి, వాకలపూడి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు.

➡️