నూతన ఓటు నమోదుకు ఏప్రిల్‌ 14 వరకు అవకాశం : తహశీల్దార్‌ డి.సుధా

ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా ) : ఓటు హక్కు పొందేందుకు ఈనెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండినవారంతా అర్హులేనని 14వ తేదీ లోపు విధిగా దరఖాస్తు చేసుకోవాలని తహశీల్దార్‌ డి.సుధా పత్రికా ముఖంగా తెలిపారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ …. కొత్త ఓటు నమోదు చిరునామా చేర్పులు, మార్పులు 14వ తేదీ లోపు వచ్చినవి మాత్రమే పరిశీలిస్తామని అన్నారు. అర్హులైన వారందరికీ మే 13న జరిగే ఎన్నికల్లో ఓటు వేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు యువత విధిగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈనెల 14 తేదీ వరకు గడువు ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణ 18 ఏళ్లు నిండినవారు ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ యాప్‌ ఆన్‌లైన్‌లో ఫారం -6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. చిరునామా ఓటు మార్పు ఫారంఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందినవారి పేర్లను అనుబంధ జాబితా ద్వారా చనిపోయినవారు, బదిలీ ఓటర్లు ఏ ఎస్‌ డి జాబితాలో నమోదు చేస్తామన్నారు. ఓటు పై సందేహం ఉంటే ఓటర్ల జాబితా లో పేర్లు ఆన్‌లైన్‌ ద్వారా సరి చూసుకోవచ్చునని సుధా తెలిపారు.

➡️