కరాటే పోటీలలో పద్మా విద్యా వికాస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

Dec 6,2023 14:29 #Kurnool
padma vikash school karate games

ప్రజాశక్తి-వెల్దుర్తి : వెల్దుర్తి పట్టణంలోని పద్మ విద్య వికాస్ విద్యార్థులు కర్నూల్ టౌన్ లోని దేవి ఫంక్షన్ హాల్ లో డిసెంబర్ మూడవ తేదీన జరిగిన దక్షిణ రాష్ట్రాల కరాటే పోటీలలో పద్మ విద్యా వికాస్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్నారు అని పద్మ విద్యా వికాస్ స్కూల్ హెడ్మాస్టర్ బడే సాహెబ్ తెలిపారు. స్కూల్ నందు ఏర్పాటుచేసిన అభినందన సభలో స్కూల్ కరస్పాండెంట్ ఆశా మేడం మాట్లాడుతూ క్రీడలలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని అలాగే ఓవరాల్ ఛాంపియన్ షిప్ మా స్కూల్ కు రావడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయానికి కృషిచేసిన కరాటే మాస్టర్లు ఫయాజ్ సురేష్ ను హెడ్ మాస్టర్ బడే సాహెబ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

➡️