సీఈవో సమీక్షలో పల్నాడు కలెక్టర్

Feb 10,2024 14:15 #palnadu district
palnadu collector in ceo review

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా ఎన్నికల సంక్షిప్త సమాచారంపై జిల్లా కలెక్టరేట్ లో ఎస్.ఆర్ వీడియో కాన్ఫరెన్స్ శంకరన్ హాల్లో సమావేశంలో జిల్లా ఎన్నికల సమాచారాన్ని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి అందించారు. ఈ సమావేశంలో ఎన్నికల సరళి పై ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఆర్డీవోలు, తహశీల్దార్లు తదితరులు హాజరయ్యారు, వారి వారి నియోజకవర్గాల పరిధిలో చేపట్టిన ఎన్నికల ప్రక్రియ గురించి జిల్లా కలెక్టర్ కు వివరించారు. నూతన యువ ఓటర్ లు కార్డులు, చనిపోయిన వారి ఓటర్ల వివరాలు, ఫామ్ 6, ఫామ్ 7,8 వివరాలు, తదితర ఓటర్ల వివరాలను ఎలక్షన్ సీఈవోకు తెలియజేశారు. ఈ ఎన్నికల సమయత్త సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, ఏ.ఆర్.వో లు, ఏఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు.

➡️