పేదలకు దుస్తులు పంపిణీ

Jan 14,2024 16:02 #alamuru

ప్రజాశక్తి – ఆలమూరు:మండల కేంద్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, దాత వంటిపల్లి పాపారావు ఆదివారం సంక్రాంతి వేడుకలలో భాగంగా భోగి సందర్భంగా పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన సంపాదనలో కొంత మేర ఆపన్నుల అవసరాలు తీరుస్తూ ఎంతో సంతృప్తి పొందుతున్నానన్నారు. మనకు కలిగిన దానిలో కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడం మానవత దఅక్పధంగా ఆయన పేర్కొన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తూ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

➡️