టిడిపి మేనిఫెస్టోను ప్రజలు నమ్మరు

May 2,2024 21:02

ప్రజాశక్తి- మెంటాడ : అమలు సాధ్యం కాని హామీలతో రూపొందించిన టిడిపి, జనసేన మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదని ఉపముఖ్యమంత్రి పి.రాజన్నదొర తెలిపారు. గురువారం మండలంలోని కొండలింగా లవలస, చింతాడవలస, జక్కవ, బడేవలస, పెదచామ లాపల్లి, పెదమేడపల్లి, కుంటినవలస గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హయాంలో రాష్ట్రంలో సుభిక్ష పాలన కొనసాగిందన్నారు. అర్హత కలిగిన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేశామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి రెడ్డి సన్యాసినాయుడు, వైస్‌ ఎంపిపిలు సారిక ఈశ్వరరావు, పొట్టంగి దుర్గ, సాలూరు నియోజకవర్గం మహిళా అధ్యక్షులు సిరిపురం నాగమణి, వైసిపి మండల అధ్యక్షులు రాయిపిల్లి రామారావు, లెంక రత్నాకర్‌ నాయుడు, సర్పంచులు రేగిడి రాంబాబు, మహంతి రామునాయుడు, గేదెల సతీష్‌ పాల్గొన్నారు గ్రామాల్లో బొత్స సందీప్‌ ప్రచారంమెరకముడిదాం: మండలంలోని కుంచుగుమడాం, గొట్టిపల్లి, గాదేల మర్రివలస గ్రామాలలోని ఉపాధి వేతనదారుల వద్ద మంత్రి బొత్స తనయుడు సందీప్‌ గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మీ కష్టాలను, బాధలను అర్ధం చేసుకొని స్థానికంగా ఉన్న వ్యక్తి మీ సత్తిబాబు అని అతన్ని మరోసారి ధీవించాలని కోరారు. ఐదేళ్లకొకసారి మోసపూరిత హామీలు ప్రకటిస్తూ ప్రజలను మోసం చేసే చంద్రబాబును నమ్మితే మన బ్రతుకులు, మన పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిపారు. బొత్స సత్యనారాయణను ఎమ్మెల్యేగా, బెల్లాన చంద్రశేఖర్‌ను ఎమ్‌పిగా ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెరకము డిదాం యువత, మాజీ డిసిఎంఎస్‌ చైర్మన్‌ ఎస్‌వి రమణరాజు, తాడ్డి వేణుగోపాలరావు, కోట్ల వెంకటరావు, బూర్లె నరేష్‌, సీతారామరాజు, గొట్టిపల్లి సర్పంచ్‌ సుంకరి రమేష్‌, బాలి మహేష్‌ పాల్గొన్నారు.సంక్షేమ పాలనకు ఓటు వేయండిప్రజల సంక్షేమమే అభివృద్ధిగా భావిస్తున్న వైసిపికి మరోసారి పట్టం కట్టాలని కోరుతూ మండలంలోని బైరిపురంలో గ్రామ సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ పప్పల విజయ కుమారి, పప్పల క్రిష్ణ మూర్తి గురువారం ప్రచారం చేశారు. మన గ్రామ అభివృద్ధికి సహకరించిన బొత్స సత్యనారాయణను, ఎమ్‌పిి బెల్లాన చంద్రశేఖర్‌ను గెలిపించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి కందుల పార్వతి, కందుల మల్లికార్జునరావు, సింగారపు రామకృష్ణ, గ్రామ యూత్‌ లీడర్‌ పప్పల సుధీర్‌ నాయుడు, పాల్గొన్నారు.

➡️