అభివృద్ధి చేశా…ఆదరించండి : బొత్స

May 2,2024 21:23

ప్రజాశక్తి – మెరకముడిదాం : ప్రజల ఆలోచనా విధానం, అభిమ తం ప్రకారం నడుచుకొని అభివద్ధి చేశానని, తనను ఆదరించండని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మండలంలోని నరసయ్యపేట, గర్భాం , సింగవరంలో గురువారం ప్రచారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భాంలో కోటి రూపాయలతో పాఠశాలల అభివద్ధి, తారు రోడ్లు, తాగునీరు అందించా మన్నారు. మోడల్‌ పాఠశాల, జూనియర్‌ కళాశాల, కల్యాణ మండపం, జొన్న పరిశ్రమ లాంటి అభివద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. తాను గెలిచిన వెంటనే మండలానికి సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు ఒక్క పైసా లంచం లేకుండా ఇంటి వద్దకే పెన్షన్‌ అందిస్తే వాటిని కూడా ప్రజలకు అందకుండా ప్రతిపక్షం అడ్డుకుందని తెలిపారు. టిడిపి అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో జెడ్పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, తాడ్డి వేణుగోపాల రావు, పెదబాబు, కోట్ల వెంకటరావు, సత్తారు జగన్‌ మోహనరావు, బూర్లె నరేష్‌, పప్పల క్రిష్ణ మూర్తి, పలువురు పాల్గొన్నారు.

➡️