ఎఎస్‌ఐపై పోక్సో కేసు

Apr 5,2024 22:03

ప్రజాశక్తి – మేడికొండూరు : కీచకుల బారి నుండి కాపాడాల్సిన పోలీసే వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. మనవరాలి వరుసైన బాలికతో అసభ్యంగా మాట్లాడిన ఎఎస్‌ఐపై పోక్సో కేసు నమోదైంది. దీనిపై మేడికొండూ రు పోలీసుల వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం బండ్లమోటు పోలీస్‌స్టేషన్‌లో ఎఎస్‌ఐగా పని చేస్తున్న ఏలూరి శ్రీనివాసరావు తన అక్క మనవరాలైన బాలికతో శుక్రవారం ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడారు. మరుసటి రోజైన శనివారమూ అదే తరహాలో మాట్లాడ్డంతో బాధితురాలు మానసిక వేదన తట్టుకోలేక తల్లిదండ్రులకు వివరించారు. దీంతో వారు శుక్రవారం మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుని సోషల్‌ మీడియా ఖాతనూ పోలీసులు పరిశీలించి అసభ్యంగా మాట్లాడినట్లు ప్రాథమికంగా నిర్థారించుకుని శ్రీనివాసరావుతోపాటు సమీప బంధువైన మరో మహిళపైనా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

➡️