పోస్టల్‌ బ్యాలెట్‌ను వియోగించుకోవాలి

పల్నాడు జిల్లా : సాధారణ ఎన్నికలలో ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా విని యోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి లోతేటి శివ శంకర్‌ అన్నారు. బుధవారం ఆయన మాట్లా డుతూ ఎన్నికల విధులకు హాజ రయ్యే ప్రతి ఉద్యోగికి, అధికారులకు పోలీసు సిబ్బం దికి, నాన్‌ గవర్న మెంట్‌ ఉద్యో గులు డ్రైవర్లు, క్లీనర్లు, కండక్టర్లు, వీడియోగ్రాఫర్లు, అందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటును విని యోగించు కునే అవకాశం కల్పిం చినట్లు చెప్పారు. మే 5న పిఒ, ఎపిఒ,ఒపిఒలకు, 6న పోలీస్‌ సిబ్బందికి , 7న డ్రైవర్లు, క్లీనర్లు, వీడియోగ్రాఫర్లు, అత్యవసర సర్వీసు లలో పనిచేసే 33 శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యో గులకు ఫెస ిలిటేషన్‌ సెంటర్లలో పోస్టల్‌ బ్యాలట్‌ ఓటిం గ్‌కు సదుపాయం కల్పించినట్లు చెప్పారు. ఈ నెల 5 నుండి 7 వరకు ఫెసిలిటేషన్‌ సెంటర్ల వద్ద ఉదయం 9.00 గంటల నుండి సాయంత్ర 5.00 గంటల వరకు ఫారం- 12 ద్వారా దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగు సౌకర్యం కల్పించ నున్నట్లు చెప్పారు. పెదకూరపాడు నియోజకవర్గంలో జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో, చిలకలూరిపేట మండలం గణప వరం జిల్లా పరిషత్‌ స్కూల్‌ లో, నరసరావుపేట ఎస్‌. తఎస్‌.ఎన్‌ కళాశాలలో, సత్తెనపల్లి జిల్లా పరిషత్‌ గర్ల్స్‌ హై స్కూల్‌లో, వినుకొండ లయోలా స్కూల్‌, గురజాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మాచర్లలో జిల్లా పరిషత్‌ గర్ల్స్‌ హై స్కూల్‌ వద్ద పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ సౌకర్యం కల్పించినట్లు వివరించారు.

➡️