ప్రభుత్వ ఉద్యోగా..? పార్టీ నాయకుడా..?

May 24,2024 11:36 #Nellore District
  • ఏపీఎం కీచక పర్వాలు తెలియజేసిన బాధితులు
  • విచారంలో విస్తుబోయే నిజాలు

ప్రజాశక్తి-కోవూరు : కోవూరు వెలుగు ఇంచార్జ్ ఏపిఏం వెంకటస్వామి ఆడియో లీకుపై విచారణ చేపట్టెందుకు అధికారులు టీమ్ ను నియమించిది. కోవూరు తహసీల్దార్ పర్యవేక్షణలో ఇంచార్జ్ ఏపిఏంపై విచారణకు సిద్ధం అయింది. ఈ నేపథ్యంలో ఇంచార్జ్ ఏపిఏం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి గెలుపుపై తాను భుజాలు మీద మోసుకొన్నట్లుగా ఫోన్ లో 70శాతం వరకు ఎన్నికల ప్రచారం కె కేటాయించి నందు వల్ల ప్రతి పక్షాలు దీన్ని తప్ప పట్టి ఉన్నత అధికారులకు వెల్లు వెత్తిన పిర్యాదులు చేసిన వైనం తెలిసిందే. ఏది ఏమైనా ఇంచార్జ్ ఏపిఏం వెంకటస్వామికు సస్పెండ్ వేటు పడే అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి వైసిపి పార్టీకే కోవూరు ఇన్చార్జ్ ఏపిఎం వెంకట్ స్వామి ఫోన్లో చేసిన ఎన్నికల ప్రచారంపై తెదేపా ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. అసలు పార్టీ నాయకుడా లేదా ప్రభుత్వ ఉద్యోగ అన్న సందేహాలు బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో కోవూరు తాసిల్దార్ విజయ శ్రీ పర్యవేక్షణలో 35 మంది వివోఏలతో విచారణ సాగింది. నివేదికను ఉన్నత అధికారులకు పంపినట్లు సమాచారం.

విచారణలో విస్తూబోయే నిజాలు..
తాసిల్దారు వీవోఏలను పిలిచి విచారిస్తున్న నేపథ్యంలో ఏపీఎం వెంకటస్వామి వల్ల తాము పడుతున్న ఇబ్బందులు, పలువురు మహిళలు పడుతున్న ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. ఆధారాలతో సహా తాసిల్దారుకు చూపించడంతో గత ఐదు సంవత్సరాలుగా మహిళలు పడుతున్న వేధింపులు వెలుగులోకి వచ్చాయి. వైఎస్ఆర్సిపి నాయకులు అండగా ఉండగా తనను ఏమీ చేయలేరని మహిళలను ఇంకా వేధింపులకు గురి చేసినట్లు సమాచారం.

➡️