కాలువ కట్టల సమస్యలు పరిష్కరిస్తాం..

Apr 6,2024 11:48 #Nellore District

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు సిటీలో రైల్వే స్థలాలు, కాలువ కట్టలపై నివాసం ఉన్న పేదల పరిస్థితి దుర్భరంగా ఉందని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వం, ప్రస్తుత వైసిపి ప్రభుత్వం పునరావాసం చూపకుండా పేదల ఇళ్లను కూల్చారని పేర్కొన్నారు. రైల్వే స్థలాలు, కాలువ కట్టలపై వున్న ప్రజలకు నిత్యం అండగా ఉండి సిపిఎం పోరాటాలు నిర్వహించిందన్నారు. నిజాయితీ, నిరాడంబరతగా ప్రజల మధ్య పని చేస్తూ, ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఎం అభ్యర్ధిగా మూలం రమేష్ పోటీ చేస్తున్నారని, ప్రజలందరూ ఆదరించి అధిక మెజారిటీతో గెలిపించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి షేక్.మస్తాన్ బీ అన్నారు. నెల్లూరు సిటీ 5వ డివిజన్ పరిధిలోని బర్మాషెల్ గుంట, పాత చెక్ పోస్ట్, అహ్మద్ నగర్ ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి సిపిఎం నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేసారు.

➡️