ఒంగోలులో అంగన్వాడీల బిక్షాటన  

Dec 20,2023 12:56 #Prakasam District
prakasam anganwadi workers strike on 9th day

ప్రజాశక్తి – ఒంగోలు కలెక్టరేట్ : తమ న్యాయమైన డిమాండ్లు డిమాండ్లు సాధించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. సమ్మెను ఎల్ఐసి ఉద్యోగుల బ్రాంచ్ కార్యదర్శి పారా శ్రీనివాసరావు ప్రారంభించి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం విడి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. అనంతరం అంగన్వాడీలు ఒంగోలు ఎల్ఐసి కార్యాలయం నుండి రిమ్స్ హాస్పటల్ వరకు రోడ్డు మార్గంలో బిక్షాటన చేశారు.కార్యక్రమంలో సిఐటియు నగర ఉపాధ్యక్షులు జి రమేష్, నగర కార్యదర్శి టి మహేష్, అంగన్వాడీ యూనియన్ నాయకులు కెవి సుబ్బమ్మ, కే ప్రశాంతి ,హేమీమా ,శ్రీదేవి, జ్యోతి పద్మ ,నిర్మల, అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు

➡️