కురిచేడు రైల్వే స్టేషన్ సమీపంలో వ్యక్తి హల్ చెల్

Feb 7,2024 11:01 #Prakasam District
attack in railway station

ఇద్దరిపై బండ రాయితో దాడి  

ప్రకాశం-కురిచేడు : కురిచేడు రైల్వే స్టేషన్ దగ్గర పొలంలో ఎండు మిరపకాయలు గ్రేడింగ్ చేసుకుంటున్న మార్కాపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన కోటకొండ చిన్న కోటయ్య, కోటకొండ అంజమ్మలపై బండ రాయితో దాడి చేశాడు. ఈ దాడిలో కోటయ్య తల, చెవికి తీవ్ర గాయాలు, అంజమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని కట్టేసి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. వ్యక్తిని విచారించగా వినుకొండ మండలం కొచ్చర్ల, తుల్లూరు అజయ్ తండ్రి చెంచయ్య అని తెలిపాడు. చేయడానికి పనులు లేకపోవడంతో కురిచేడు వచ్చానని తెలిపాడు.

➡️