మాగుంట చందన ప్రచారం

May 6,2024 23:54 ##Ongole #Magunta

ప్రజాశక్తి – పొదిలి
టిడిపి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి కోడలు మాగుంట చందనారెడ్డి, మార్కాపురం ఎంఎల్‌ఎ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి సోదరి యేరువ లక్ష్మీ పట్టణంలోని 9వ వార్డులో ఇంటింటికి మన కందుల ఎన్నికల ప్రచారం సోమవారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి ఎంఎల్‌ఎ అభ్యర్థి కందుల నారాయణరెడ్డి, ఒంగోలు ఎంపి అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు కాటూరి వెంకట్ నారాయణ బాబు, మీగడ ఓబులురెడ్డి, పోపూరి నరేష్ పాల్గొన్నారు.

➡️