జాతీయ యువజన దినోత్సవం

Jan 13,2024 00:36

ప్రజాశక్తి – నాగులుప్పలపాడు
మండలంలోని ఉప్పుగుండూరులో వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో వివేకానంద జయంతి, యువజన దినొత్సవం నిర్వహించారు. సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కామిశెట్టి శంకరరావు, ఎంఇఒ తిరుమలశెట్టి రవి, వైద్యులు జి సుబ్పారావు వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సేవా సమితి ఉపాధ్యక్షులు కొల్లా శ్రీనివాసరావు, సెక్రటరీ పావులూరి శివాజీ, గండు హరిబాబు, పాఠశాలల ఉపాధ్యాయులు శ్రీనివాసులు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.


భట్టిప్రోలు : మండలంలోని ఐలవరంలోని వివేకానంద విద్యా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. వివేకానంద చిత్రపటంతో పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి సంస్థ వ్యవస్థాపకులు జంజనం హేమ శంకర్రావు మాట్లాడారు. ప్రతి ఏట అందించే వివేకనంద పురస్కారాన్ని 2024కు ఉపాధ్యాయులు ఎల్లాప్రగడ సీతాపతికి అందజేసి దుశ్యాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మురుగుడు శ్రీనివాసరావు, మాజీ జెడ్పిటిసి బండారు కుమారి శ్రీనివాసరావు, వామనపల్లి కోటేశ్వరరావు పాల్గొన్నారు.

➡️