ప్రజల ప్రోత్సహం బాగుంది

Jan 13,2024 23:48

ప్రజాశక్తి – యద్దనపూడి
మండలంలోని అనంతవరం గ్రామంలో శనివారం రాత్రి ఎన్‌టిఆర్‌ కళాపరిషత్ తెలుగు రాష్ట్రాల ద్వితీయ నాటికల పోటీలు జరిగాయి. 3వ రోజు నిశబ్దామా నీ ఖరీదెంత, ప్రక్షాళన, మిణుగరు వెలుగులు, నాటికలను ప్రదర్శించారు. మొదటి నాటికకు విజయ్ డిజిటల్స్ రూ.20వేలు, 2వ నాటికకు గుదే సిస్టర్స్ రూ.20వేలు, 3వ నాటికకు కళాపరిషత్ రూ.20వేలు పారితోశకం అందించారు. పోటీలకు బొప్పూడి కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి అరెకట్ల ప్రసాద్, కెనరా బ్యాంకు మేనేజర్ పెడవల్లి శ్రీనవాసరావు హాజరు అయ్యారు. కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు పాండు రంగారావు, ఆర్ శ్రీను, ఈశ్వరప్రసాద్, పాపరాజు, రాధ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

➡️