సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు

Jun 17,2024 21:18

ప్రజాశక్తి – కొమరాడ: సీజనల్‌ వ్యాదులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్‌ మోహన్‌ రావు అన్నారు. మండలంలోని చంద్రంపేట, మార్కొండపుట్టి గ్రామాలను సోమవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా సందర్శించి గ్రామాల్లో ఫీవర్‌ సర్వే, డ్రైడే కార్యక్రమాలు ఏ మేరకు చేపడుతున్నారో పరిశీలించారు. ఇంటి పరిసరాల్లో దోమల లార్వా వృద్ధి చెందే ప్రదేశాలను సకాలంలో గుర్తించి, నివారణ చర్యలు చేపడుతన్నదీ, లేనిదీ, గ్రామాల్లో జ్వరాలు ఏమైనా ఉన్నాయా తదితర వివరాలపై ఆరా తీశారు. జూన్‌ 1 నుంచి 30 వరకు మలేరియా వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా అక్కడ ప్రజలకు మలేరియా, డెంగీ తదితర సీజనల్‌ వ్యాదులపై అవగాహన కల్పించారు. జ్వరాలు ప్రధానంగా దోమల ద్వారా ప్రబలుతాయని, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలని ముఖ్యంగా ఉపయోగంలో లేని పడవేసిన తొట్లు, డబ్బాలు, టైర్లు, కొబ్బరి చిప్పలు మొద లగు వాటిలో వర్షపు నీరు చేరి దోమల ఉత్పత్తి జరుగుతాయని వాటిని తొలగిం చాలని అన్నారు. ప్రతిరోజూ డ్రైడే పాటించాలన్నారు.. ఈ కార్యక్రమంలో సూపర్‌ వైజర్‌ జయగౌడ్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ రామకృష్ణ, ఆశ కార్యకర్తలు తదిత రులు పాల్గొన్నారు.

➡️