మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి

Jun 16,2024 22:20
ఫొటో : మొక్కలు నాటుతున్న జెవివి నాయకులు

ఫొటో : మొక్కలు నాటుతున్న జెవివి నాయకులు

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడండి

ప్రజాశక్తి-కోవూరు : పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఆదివారం జన విజ్ఞాన వేదిక కోవూరు మండల శాఖ వారు గుమ్మళ్లదిబ్బ గ్రామంలో మొక్కలను నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కొత్త కాలనీలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కౌన్సిలర్‌ బుజ్జయ్య మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడవచ్చని తెలిపారు. అందువల్ల వాతావరణ కాలుష్య నివారణ అవుతుందని, సకాలంలో వర్షాలు కురుస్తాయన్నారు. అందుకే అందరూ కలసి మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాస్కర్‌, ఎస్‌కె జిలాని, పుల్లయ్య, ఎస్‌కె రహమతుల్లా, శ్రీశైల, వెంకయ్య, జయప్రకాశ్‌, సుబ్బారావు, నరేంద్ర, చలపతి, వెంకటేశ్వరరాజు, సురేంద్ర, శ్రీనివాసులు, మంజుల, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️