ప్రజా విజయం… వారికే అంకితం : ఎమ్మెల్యే అరవిందబాబు

పల్నాడు జిల్లా: నరసరావుపేట నియోజకవర్గంలో రెండు దశా బ్దాల కలగా ఉన్న టిడిపి గెలుపు శ్రేణులలో నూతన ఉత్తే జం నింపిందని ప్రజలు ఇచ్చిన అఖండ విజయాన్ని నియోజకవర్గ ప్రజలకే అంకితం ఇస్తున్నానని, ఇది ప్రజా విజయమని ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు. నరసరావుపేట నియో జకవర్గంలో టిడిపి గెలుపుతో నరసరావుపేట మండ లంలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు గ్రామం నుండి గోనెపూడి గ్రామం మీదుగా ఆదివారం కోటప్పకొండకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తున్న టిడిపి అభిమాను లను, వృద్ధులను కలిసి ఆయన ఆప్యాయంగా పలుక రించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తనను గెలిపించిన ప్రతి ఒక్క రికి రుణపడి ఉంటానన్నారు. ప్రజా సమస్యల పరిష్కా రానికి, ముఖ్యంగా నియోజకవర్గంలో నెలకొన్న సమ స్యలు పరిష్కరిస్తామని, యువతకు ఉపాధి కల్పించే విధంగా తన వంతు కృషి చేస్తానని చెప్పారు. వైసిపి పై ప్రజలు ఎంతగా విరక్తి చెందారో, తిరుగుబాటుకు ఏ స్థాయిలో తెగించారో ఎన్నికల ఫలితాలే నిదర్శన మన్నారు. కార్యక్రమంలో గుర్రం పూర్ణచంద్రరావు, గట్టి నేని శ్రీనివాసరావు, ఏల్చూరి శ్రీనివాసరావు టిడిపి నాయకులు మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.

‘ఫర్నిచర్‌ దొంగ మాజీ ముఖ్యమంత్రి జగన్‌’

2019 ఎన్నికలలో ఓటమి అనంతరం దివంగత సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు తన వద్ద ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్‌ తీసుకువెళ్లాలని, అవసరం లేకుంటే ఉంచుకొని డబ్బు చెల్లిస్తానని నాటి అసెంబ్లీ కార్యదర్శికి రెండు సార్లు ఉత్తరం రాస్తే దానిని రాజకీయంగా వాడుకొని అసెంబ్లీ ఫర్నీచర్‌ దొంగిలించారని కోడెలను మానసికంగా హింసించారని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు ఆరోపించారు. నరస రావుపేటలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లా డుతూ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇంట్లో ఉన్న ప్రభుత్వ ఫర్నీచర్‌ సరెండర్‌ చేయకుండా వాడుకుంటుంటే వైసిపి నేతలు నీతులు చెప్పడం సిగ్గు చేటన్నారు. కోడెల శివప్రసాద్‌ తప్పు చేసి చనిపోలేదని వైసిపి నేతల వేధింపులు తాళలేక పోయారన్నారు. తాడేపల్లి,లోటస్‌ పాండ్‌ ఇళ్లకు రూ 50 కోట్లు సీఎంవో ఖాతాలో నిధులతో ఫర్నిచర్‌,ఇతర వసతులను తన నివాసంలో అమర్చుకున్నారన్నారు. ప్రభుత్వ ఫర్నిచర్‌ తిరిగి అప్పగిస్తానని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ఇప్పటి వరకు ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ సొమ్ముతో తన ఇంట్లోకి కొనుగోలు చేసిన ఫర్ని చర్‌ను ప్రభుత్వానికి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

➡️