రాహుల్‌ గాంధీ పుట్టినరోజు వేడుకలు

Jun 19,2024 11:22

ప్రజాశక్తి-చోడవరం (అనకాపల్లి) : రాహుల్‌ గాంధీ జన్మదినం సందర్భంగా … బుధవారం చోడవరం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ జగత శ్రీనివాసరావు స్థానిక మారుతి నగర్‌ లో కేక్‌ కట్‌ చేసి 50 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ … రాహుల్‌ గాంధీ జూడో యాత్ర చేపట్టి దేశం మొత్తం మీద పర్యటించి ఇండియా కూటమిని అత్యధిక సీట్లు సాధించేందుకు కృషి చేశారన్నారు. భవిష్యత్తులో రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి దేశంలో అధికార పగ్గాలు చేపడుతుందని దీంతో దేశంలో పేదరికం మతసామరస్యం అభివృద్ధి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగుల అర్జున్‌, వీర్రాజు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

➡️