ఆటోలలో ఓవర్ స్పీడు, ఓవర్ లోడ్ ప్రమాదకరం

ప్రజాశక్తి-రాజవొమ్మంగి : ఆటోలలో ఓవర్ లోడు, ఓవర్ స్పీడు ఎంతో ప్రమాదకరమని రాజవొమ్మంగి ఎస్ఐ ఎస్ వెంకయ్య అన్నారు. ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ, రంపచోడవరం ఏ ఎస్పి ఆదేశాల మేరకు రాజవొమ్మంగి సీఐ షేక్ బాజీలాల్ ఆధ్వర్యంలో ఎస్ఐ వెంకయ్య శనివారం స్థానిక అల్లూరి జంక్షన్ వద్ద ఆటోడ్రైవర్లతో, యూనియన్ సభ్యులతో రోడ్డు సేఫ్టీ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. తొలిత ఆటోలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకయ్య మాట్లాడుతూ, ఆటో ఓనర్లు తప్పనిసరిగా ఆటోలకు సంబంధించిన ఇన్సూరెన్స్,ఇతర రికార్డులు తప్పనిసరిగా కలిగి ఉండాలని, ఆటో డ్రైవర్లుకు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాలని సూచించారు. పరిణితిమించి ప్రయాణకులను ఎక్కించిన, అతివేగంగా ఆటో నడిపిన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆటో డ్రైవర్ జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. పాఠశాలలకు విద్యార్థులను తరలించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలని,విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ చూపి సకాలంలో పాఠశాలలకు వెళ్లేలా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు,అడిషనల్ ఎస్ఐ జాన్ బాబు, పోలీస్ సిబ్బంది,ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

➡️