ఆర్‌బికె ఊసలకే పరిమితం

Apr 9,2024 21:18

 ప్రజాశక్తి – వీరఘట్టం :  రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీతో పాటు నాణ్యమైన ఎరువులు అందించేందుకు వీలుగా ఆర్‌బికెల నిర్మాణానికి శ్రీకారం చుట్టుంది. అధికారుల అలసత్వం వల్ల కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించక రైతు భరోసా కేంద్రాల నిర్మాణం ఊసలకే పరిమితమైంది. మండల కేంద్రంతో పాటు రేగులపాడు, దశమంతపురం, వండువ, తెట్టంగి, హుస్సేన్‌పురం, కత్తుల కవిటి, బిటివాడ, చిదిమి, చలివేంద్రి, సంతనర్సిపురం, నడుకూరు, కిమ్మీ, చిట్టపూడివలస, నడిమికెల్లా, కంబర, చినగోరకాలనీ, తలవరం, పనసనందివాడ, తదితర గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే బిటివాడ, హుస్సేన్‌ పురం, కత్తులకవిటి, కిమ్మీ, రేగులపాడు గ్రామంలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణ పనులు చేసుకుని ప్రారంభోత్సవాలు కూడా జరిగాయి. మండల కేంద్రంలోని మేజర్‌ పంచాయతీ కార్యాలయ ఆవరణలతో పాటు దశమంతపురం గ్రామాల రైతు భరోసా కేంద్రాలు ఊసలతో దర్శనమిస్తున్నాయి. స్థానిక మేజర్‌ పంచాయతీ పరిధిలో నాలుగు సచివాలయాల్లో ఎక్కడా రైతు భరోసా కేంద్రాలు పూర్తి కాకపోవడంతో ప్రస్తుతం వీటిని నిర్వహణ మార్కెట్‌ యార్డు ఓ భాగంలో రైతు భరోసా కార్యకలాపాలు సాగుతున్నాయి.

➡️