లారీ ఢీకొని యువకుడు మృతి

Nov 23,2023 11:55 #Kurnool, #road accident
road-accident-in-kurnool

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు మండలం గార్గేయపురం పరిధిలోని నగరవనం సమీపంలో బైకును లారీ ఢీకొన్న ఘటనలో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. క్రిష్ణగిరి మండలం పుట్లూరు గ్రామానికి చెందిన విజయ్ కుమార్ 30 గురువారం తెల్లవారుజామున తన భార్య నూరైనా ఉలిందకొండ నుంచి బావమరిది మహేష్ అలియాస్ మహేంద్ర తో కలిసి పల్సర్ బైక్ పై నంద్యాల జిల్లా, నందికొట్కూరు మండలం, బొల్లవరంలోనీ ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఉదయం సుమారు 7:00 నుంచి 8 గంటల సమయంలో మండలం, గార్గేయపురం, పరిధిలోని నగరవనం సమీపానికి చేరుకోగానే నందికొట్కూరు వైపు నుంచి కర్నూలుకు వైపు వస్తున్న ఐచర్ వాహనం ఎదురుగా వస్తున్న పల్సర్ బైక్ ను ఢీకొంది. విజయ్ కుమార్ అక్కడికక్కడే తలకు తీవ్ర గాయమై మృతి చెందారు మహేష్ అలియాస్ మహేంద్రకు కాలు తిరిగి తీవ్ర గాయాల పాలయ్యాడు. చిత్రగాత్రున్ని కర్నూలు సరోజన ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స అందిస్తున్నారు. తునికి భార్యతో పాటు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు

➡️