షార్ట్‌ సర్క్యూట్‌తో ఆర్‌టిసి బస్సు దగ్ధం

ప్రజాశక్తి-శింగరాయకొండ : షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగడంతో తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఆర్‌టిసి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన టంగుటూరు మండల పరిధిలోని సూరారెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. అందిన వివరాల ప్రకారం…తెలంగాణా రాష్ట్రం కోదాడ డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు తిరుపతి నుంచి 23 మంది ప్రయాణికులతో కోదాడకు బయలు దేరింది. బస్సు సురారెడ్డిపాలెం వద్దకు రాగానే బస్‌ ఇంజన్‌లోంచి పొగలు రావటాన్ని డ్రైవర్‌ రత్నలాల్‌ గమనించాడు. వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను బస్సులోంచి బయటకు దించాడు. ప్రమాదం గురించి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందడంలో వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు పూర్తికా కాలిపోయింది.ప్రయాణికులను మరో బస్సు ద్వారా వారి గమ్య స్థానాలకు చేర్చారు. శింగరాయకొండ సిఐ దాచేపల్లి రంగనాథ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్‌ రత్నలాల్‌ అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే తాము ప్రమాదం నుంచి బయట పడినట్లు ప్రయాణికులు తెలిపారు.

➡️