విజ్‌ డమ్‌ స్కూల్‌లో సంక్రాంతి సంబరాలు

ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : మండలంలోని గాంధీ నగర్‌లో గల విజ్‌డమ్‌ సీబీఎస్‌ఈ హై స్కూల్‌లో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి వివిధ రకాల వేషధారణలో అలరించారు. పల్లెటూరి వాతావరణం మరిపించేలా రంగవల్లులు,భోగి మంటలు వేసి కోలాటలాడరు పొంగల్లు వండారు రకరకాల బొమ్మలతో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు నత్య గీతాలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ధర్మచార్యులు గంగన్నపల్లి వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సౌర మాసం జరుపుకునే పండుగని సూర్యుడు మకర రాశి లోకి ప్రవేశించే శుభ ఘడియలే మకర సంక్రమణమని అన్నారు. అది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ జరుపుకునే పెద్ద పండుగ అని అన్నారు.పాఠశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రదీప్‌ మాట్లాడుతూ ప్రజలంతా కలిసిమెలిసి జరుపుకునే పండుగ సంక్రాంతి అని అందరూ సుఖసంతోషాలతో ఈ పండుగలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆటల పోటీల్లో వేషధారణలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్‌ డైరెక్టర్‌ టి మదన్మోహన్‌ ప్రిన్సిపల్‌ కోటేశ్వరరావు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️