రాజవొమ్మంగి సిఐగా సన్యాసినాయుడు బాధ్యతలు స్వీకరణ

ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి) : శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని రాజవొమ్మంగి సీఐగా గురువారం పదవి బాధ్యతలు చేపట్టిన ఎన్‌ సన్యాసి నాయుడు పేర్కొన్నారు. సీఐగా బాధ్యతలు చేపట్టిన సన్యాసినాయుడను రాజవొమ్మంగి, జడ్డంగి ఎస్‌ఐలు ఎస్‌ వెంకయ్య, రఘునాధరావు,అడిషనల్‌ ఎస్‌ఐ జాన్‌ కుమార్‌, ఎస్బి హెడ్‌ కానిస్టేబుల్‌ దుర్గారావు, తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సన్యాసినాయుడు అల్లూరి జిల్లా పాడేరు దిశ పోలీస్‌ స్టేషన్‌ సిఐగా పనిచేసి బదిలీపై రాజవొమ్మంగి సర్కిల్‌కి వచ్చారు. ఇప్పటి వరకు రాజవొమ్మంగి సీఐగా పని చేసిన స్వామి నాయుడు విశాఖకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతన సీఐ సన్యాసినాయుడు మాట్లాడుతూ.. ప్రజలు, యువత, గంజాయి, నాటుసారా, కోడిపందాలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని లేకుంటే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. యువత చదువుతోబాటు క్రీడలుపై ఆసక్తి కనబరచాలని, బాగా చదువుకొని ఉద్యోగ అవకాశాలను అందుబుచ్చుకోవాలన్నారు. యువత గ్రామ అభివృద్ధి తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

➡️