ముగిసిన క్రికెట్‌ పోటీలు..స్కూల్‌ ఫ్రెండ్స్‌ టీం విజేత

విజేతలకు బహుమతుల అందజేస్తున్న చిత్రం 

దుగ్గిరాల: నెల రోజుల క్రితం మండల కేంద్రం దుగ్గిరాలలో ప్రారంభించిన దుగ్గిరాల ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు బుధవారం ముగిశాయి. వివిధ ప్రాంతాల నుండి 35 టీంలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. స్థానిక స్కూల్‌ ఫ్రెండ్స్‌ టీం విజేతగా నిలిచింది. విన్నర్స్‌ కు ట్రోఫీతో పాటు రూ.30 వేలు నగదు బహుమతి, రన్నర్స్‌ ఫ్రెండ్స్‌ ఎలెవెన్‌ టీంకు రూ.20 వేలు మూడో స్థానంలో నిలిచిన టీంకు పదివేల రూపాయలు నగదు బహుమతులను అందజేశారు. ఈ టిడిపి వాణిజ్య విభాగ కార్యదర్శి గూడూరు వెంకట రావు మాట్లాడుతూ గ్రామం మొత్తం ఒక టీం గా ఏర్పడి రాష్ట్ర స్థాయిలో జట్టుగా ఎదగాలని అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ దోస్త్‌ అధ్యక్షులు ఎం. గాంధీ, కె. రవీంద్ర , ప్రసాద్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️