టిడిపి సీనియర్‌ నాయకుడు గుండెపోటుతో మృతి

Feb 20,2024 11:48 #died, #heart attack, #Senior leader, #TDP

ప్రజాశక్తి-నల్లజర్ల (తూర్పు గోదావరి) : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు మల్లిపూడి భాస్కరరావు సోమవారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. పార్టీ నాయకులు తొలి మాజీ ఎంపీపీ ప్రస్తుతం వెటర్నరీ లైవ్‌ స్టాక్‌ ఆఫీసర్‌ మలిపూడి చినబాబురావు తెలిపిన వివరాల ప్రకారం … నల్లజర్ల గ్రామంలో, 1983లో ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన దగ్గర నుండి టిడిపిలో చురుకైన పాత్ర పోషిస్తూ పార్టీకి నల్లజర్ల మండలంలో నిలిచిన గొప్ప కార్యకర్త భాస్కరరావు అని తెలిపారు. ఆయన అకాల మృతికి పార్టీ ప్రస్తుత నాయకులు రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి గోపాలపురం, నియోజకవర్గ ఇన్చార్జ్‌ మద్దిపాటి వెంకటరాజు, గ్రామ నాయకులు నిమ్మలపూడి ప్రసాద్‌, కండేపు వెంకటరత్నం, మాజీ సర్పంచ్‌ మల్లిపూడి కృష్ణారావు, నాయకులు చటారి శ్రీను, ఎలమర్తి ప్రసాద్‌ నివాళులర్పించారు. భాస్కరరావు మృతదేహం పై పార్టీ జెండాను కప్పి సంతాపం తెలిపారు.

➡️