ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కళాశాలపై చర్యలు తీసుకోండి :ఎస్‌ఎఫ్‌ఐ

May 7,2024 16:12 #anathapuram, #SFI

ప్రజాశక్తి-అనంతపురం : ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రచారాలు అడ్మిషన్లు నిర్వహిస్తున్న ఐకాన్‌ కళాశాలపై చర్యలు తీసుకోవాలి ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ హిందూపురం పట్టణంలోని ఐకాన్‌ జూనియర్‌ కళాశాల నిర్వహణకు ప్రభుత్వా అనుమతులు లేకుండానే ముందస్తు ప్రచారాలు ఫేక్సిలు, బ్యానర్లు వేసి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ కళాశాలకు బిల్డింగ్‌ కూడా లేదని.. కళాశాల నిర్వహణకు సంబంధించిన కనీస సౌకర్యాలు కూడా లేకుండానే విద్యాశాఖ అధికారులు అనుమతులు ఇచ్చినారని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చంద్రశేఖర్‌, తరుణ్‌, పవన్‌, మహేష్‌, భగత్‌ పాల్గొన్నారు.

➡️