ఎన్నికల శిక్షణకు హాజరుకాని వారికి షోకాజులు

Apr 15,2024 23:39

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల విధుల నిర్వహణకు నియమించిన 4600 మంది పోలింగ్‌ అధికారులకుగాను సోమవారం మొదటి విడతగా 2300 మందికి అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో శిక్షణిచ్చారు. ఈ శిక్షణకు హాజరవ్వని 45 మందికి షోకాజు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న వారు 24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

➡️