వికలాంగుల క్రీడా కారులకు ఆర్ధిక సహాయం అందచేసిన సిరిసహస్ర

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : మార్చి 29, 30 తేదీలలో జైపూర్ (రాజస్థాన్) లో విభిన్న ప్రతిభావంతులకు 12వ పార వాలీబాల్ జాతీయస్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పారా వాలీబాల్ పోటీలలో పాల్గొనడం కోసం  విజయనగరం జిల్లా నుండి విభిన్న ప్రతిభావంతులు అయిన యనమల రామయమ్మ, మీసాల ఆదిలక్ష్మి, చుక్క కన్నతల్లి, పట్నాల రాధా, మురళి, శ్రీను వెళుతున్నారు. వీరికి రవాణా భత్యము, ఇతర ఖర్చుల నిమిత్తం చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర (సిరమ్మ) రూ.. 15000/- ఆర్ధిక సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయనగరం జిల్లా నుంచి ఈ పోటీలలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా వుందని, పాల్గొంటున్న క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు .

➡️