విశాఖపట్నం-సంత్రగచ్చి మధ్య ప్రత్యేక రైళ్లు

Jun 16,2024 23:57 #special trains
Special trains

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ : ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్‌ చేయడానికి విశాఖపట్నం – సంత్రాగచ్చి మధ్య (08502/01) (08506/05) ప్రతి దిశలో 4 ట్రిప్పులు తిరిగేలా ప్రత్యేక రైళ్లను నడపాలని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే నిర్ణయించింది. ఈ క్రమంలో 08502 విశాఖపట్నం-సంత్రగచ్చి ప్రత్యేక రైలు ఈ నెల 19, 21, 26, 28 తేదీల్లో రాత్రి 23.45 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 15.25 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది. 08501 సంత్రాగచ్చి-విశాఖపట్నం ప్రత్యేక రైలు ఈ నెల 20, 22, 27, 29 తేదీల్లో సాయంత్రం 17.00 గంటలకు సంత్రగచ్చిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. 08506 విశాఖపట్నం-సంత్రాగచ్చి ప్రత్యేక రైలు ఈ నెల 17, 22, 24, 29 తేదీల్లో రాత్రి 23.45 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 15.25 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది. 08505 సంత్రాగచ్చి-విశాఖపట్నం ప్రత్యేక రైలు ఈ నెల 18, 23, 25, 30 తేదీలలో సాయంత్రం 17.00 గంటలకు సంత్రాగచ్చి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ జంట రైళ్లు విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, పలాస, బ్రహ్మపూర్‌, ఖుర్దా రోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, జాజ్‌పూర్‌ కె రోడ్‌, భద్రక్‌, బాలాసోర్‌, ఖరగ్‌పూర్‌ మీదుగా ప్రయాణిస్తాయని, వీటి సేవలను ప్రజలు వినియోగించుకోవాలని రైల్వే శాఖ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కె.సందీప్‌ కోరారు.

➡️