అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు

Dec 6,2023 22:48

తహశీల్దార్‌ కు వినతి పత్రం అందజేస్తున్న అంగన్వాడీవర్కర్లు

               పుట్టపర్తి రూరల్‌ : అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్‌ 8 నుంచి జరిగే నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌. వెంకటేష్‌ కోరారు. ఈసందర్భంగా ఆయనతో పాటు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ దిల్షాద్‌ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనాలు అమలు చేయకపోవటంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో చెల్లించకపోవటంతో వారి పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. అంగన్వాడీలు మానసిక ఇత్తిళ్లకు గురి అవుతున్నారన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు దశలవారీగా అనేక ఆందోళనలు చేసిన ఫలితంగా అధికారులతో జరిగిన చర్చల్లో సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 8 నుండి అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి నిరవధికంగా సమ్మె చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా కార్యదర్శి అంజనేయులు, సిఐటియు జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసులు, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ దిల్షాద్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ కార్యదర్శి పెడబల్లి బాబా, సిఐటియు జిల్లా కోశాధికారి సాంబశివ, పట్టణ కార్యదర్శి గంగాధర్‌, బ్యాల్ల అంజి , కళాకారుల సంఘం నాయకులు నాగరాజు , సిద్దు, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాబునిషా, శ్రీదేవి జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. కనగానపల్లి : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడి వర్కర్లు ఈనెల 8 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ మేరకు వారు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తహశీల్దార్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనిత లక్ష్మి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బత్తల కదిరప్ప పాల్గొన్నారు

➡️