టీడీపీతోనే మహిళలకు రక్షణ

Jun 24,2024 21:36

విలేకరులతో మాట్లాడుతున్న తెలుగుమహిళలు

                     ధర్మవరం టౌన్‌ : టీడీపీతోనే మహిళలకు రక్షణ ఉంటుందని ధర్మవర నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ముతుకూరు బీబీ, పార్లమెంట్‌ ప్రధానకార్యదర్శి కత్తుల సునీత పేర్కొన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం తెలుగు మహిళలతో కలిసి ఆమె విలేఖరులతో మాట్లాడారు. టీడీపీ అధికారం చేపట్టిన వెంటనే ఈపుర పాలెం అత్యాచారం, హత్య ఘటనకు సంబందిం చి కేవలం 36 గంటల్లోనే నిందితులను పట్టుకునేలా హోంమంత్రి వంగలపూడి అనిత చర్యలు తీసుకోవడం అభినందనీయమన్నారు. అంతేకాకుండా బాధిత కుటుంబానికి రూ.10లక్షలు ఆర్థిక సాయం కూడా అందించడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై ఎన్ని అఘాయుత్యాలు జరిగినా అప్పటి సీఎం కానీ హోంమంత్రి కానీ స్పందించిన దాఖలాలు లేవన్నారు. ఈ సమావేశంలో తెలుగు మహిళ పట్టణ అధ్యక్షురాలు స్వర్ణకుమారి, ప్యారీమా, సునంద తదితరులు పాల్గొన్నారు.

➡️