ఓట్ల లెక్కింపు కేంద్రాల భవనాలు పరిశీలన

Feb 6,2024 21:45

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ 

                    కదిరి టౌన్‌ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మంగళవారం కదిరి పట్టణంలో ఈవీఎంల భద్రతా రూములు, ఓట్ల లెక్కింపు కేంద్రాలకు అవసరమయ్యే భవనాలను జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌ బాబు పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ బాలుర కళాశాలలో గదులను పరిశీలించారు. పోలింగ్‌ సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి అవసరమయ్యే భవనాలను పరిశీలించారు. అందుకు సంబందించి సంబందిత అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో కదిరి ఆర్డీవో వంశీకృష్ణ, డిఎస్‌పి శ్రీలత, మున్సిపల్‌ కమిషనర్‌ కిరణ్‌ కుమార్‌, ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ సునీతతోపాటు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పుట్టపర్తి రూరల్‌ : 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను భద్రపరిచేందుకు భవనాలను కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ మంగళవారం పరిశీలించారు. ఆర్డీవో కార్యాలయ సమీపంలోని వ్యవసాయ గోడౌన్‌లోని భవనాలను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో భాగ్యరేఖ, డిఐఒ లక్ష్మన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️