కాంగ్రెస్‌లో పలువురు చేరిక

Feb 20,2024 21:33

కాంగ్రెస్‌పార్టీలోకి చేరిన వారితో సిడబ్ల్యూసి మెంబర్‌ రఘువీరారెడ్డి

                    మడకశిర : నియోజకవర్గ పరిధిలోని అగలి మండల పరిధిలోని మధుడి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు మంగళవారం కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన 10 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరినట్లు డి బ్లాక్‌ అధ్యక్షులు త్యాగరాజు తెలిపారు. మధుడి గ్రామానికి చెందిన బలిజ హనుమంతరాయ, ప్రసన్న, వీరభద్రప్ప, దేవన్న, భరత్‌, గోవిందప్ప తదితరులు నీలకంఠాపురంలో సిడబ్ల్యూసి మెంబర్‌ రఘువీరారెడ్డి , మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరినట్లు త్యాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి వారికి కాంగ్రెస్‌ పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి రామిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల కన్వీనర్‌ లోకేష్‌, భీమరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️