కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Dec 20,2023 22:28

వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

                        కదిరి అర్బన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు కోరారు. ఈ మేరకు కార్మికులు, సిఐటియు నాయకులు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్‌ మేనేజర్‌కి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా మున్సిపల్‌ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 26వ తేదీ నుండి సమ్మెలో వెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు జనార్ధన, తిరుపాలు, బాలకృష్ణ, రాజు, నరసింహమూర్తి, చంద్రప్ప సిఐటియు నాయకులు జగన్మోహన్‌, రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️